శుక్రవారం 30 అక్టోబర్ 2020
Zindagi - Jul 21, 2020 , 23:41:55

ఉగ్రవాదులకు మానవ హక్కులా?

ఉగ్రవాదులకు మానవ హక్కులా?

ప్రపంచంలోని అతిపెద్ద ప్రమాదం ఉగ్రవాద వ్యాప్తి అని పీవీ నరసింహారావు అన్నారు. ప్రధానిగా ఉన్నపుడు ఐక్యరాజ్యసమితిలో మాట్లాడిన ఆయన.. ఉగ్రవాదానికి మానవ హక్కులు అవసరమా? అని ప్రశ్నించారు. మానవ హక్కులన్నీ ఉగ్రవాద అభ్యాసకుల కోసమే అన్వయించాలన్న వాదన భారత ప్రభుత్వానికి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ‘ఉగ్రవాద దుశ్చర్యలకు కొన్ని పొరుగుదేశాలు ధనం, ఆయుధాలను సమకూర్చుతూ శిక్షణ ఇస్తున్నాయి, ఉగ్రవాదం అనేది యుద్ధం చేయడానికి మరొక సాధనంగా మారుతున్నది’ అని అన్నారు. ఉగ్రవాదులు శాంతియుత సమాజాల ప్రాతిపదికకు ముప్పు తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించారు.