శనివారం 08 ఆగస్టు 2020
Zindagi - Jul 20, 2020 , 23:54:01

శెభాష్‌.. కృతికా!

శెభాష్‌.. కృతికా!

‘కార్తీకదీపం’ సీరియల్‌లో నటిస్తున్న శౌర్య (బేబి కృతిక) ప్రతి పుట్టిన రోజుకూ ఏదో ఒక ఆశ్రమంలో తనకు తోచిన సాయం అందిస్తూ ఉంటుంది. తాజాగా  మరో మంచి పనికీ పూనుకున్నది. తన అభిమాని ఒకరు.. ఆయన భార్యకు బర్త్‌ డే విషెస్‌ తెలుపుతూ వీడియో చేయమని కోరారు. ‘తప్పకుండా చేస్తాను. కానీ మీరొక పని చేయాలి’ అని షరతు పెట్టింది. కష్టాల్లో ఉన్నవారికి కనీసం వెయ్యి రూపాయలు సాయం చేసి, ఆ ఫొటోలు తనకు పంపాలని సూచించింది. దీంతో ఆ అభిమాని కృతిక చెప్పినట్టే చేశాడు. ఈ విషయాన్ని ఆ చిన్నారి సోషల్‌ మీడియాలో పంచుకుంది. కృతిక పదిహేను సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో నటించింది. logo