సోమవారం 28 సెప్టెంబర్ 2020
Zindagi - Jul 20, 2020 , 23:53:50

వ్యాయామం.. పిల్లలకూ అవసరమే!

వ్యాయామం.. పిల్లలకూ అవసరమే!

చిన్నారులకూ  వ్యాయామం ముఖ్యమని అంటున్నారు నిపుణులు. చిన్న పిల్లల్లో కూడా ఊబకాయ సమస్య ఎక్కువవుతున్న నేపథ్యంలో రోజూ పిల్లలతో వ్యాయామం చేయించమని చిస్తున్నారు. ఎదిగే వయసులో కండరాలు, ఎముకలు బలపడటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. 0 pt ఆరేండ్లు, అంతకన్నా ఎక్కువ వయసు పిల్లలకు రోజుకు కనీసం గంట సేపు శారీరక శ్రమ తప్పదని ఫిట్‌నెస్‌ నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు క్రమబద్ధంగా వ్యాయామం చేయడం వల్ల అనేక లాభాలుంటాయి. వారి ఎదుగుదల నుంచి చదువులో ముందుండటం వరకు ఎన్నో రకాలుగా వ్యాయామం ఉపయోగపడుతుంది. వ్యాయామం వల్ల వయసుకు తగ్గ ఎదుగుదల పుంజుకుంటుంది. కండరాలు, ఎముకలు బలోపేతమవుతాయి. అధిక బరువు ముప్పు తగ్గుతుంది. శరీర సౌష్టవం మెరుగవుతుంది. పెద్దయ్యాక మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుంది. రక్తపోటు, రక్తంలో కొలెస్ట్రాల్‌ పెరిగే ప్రమాదం ఉండదు. చురుకుదనం, ఉత్సాహం ఇనుమడిస్తాయి. 

ఆశావహ దృక్పథం, ఆత్మ

విశ్వాసం పెంపొందుతాయి. ఏకాగ్రత, చదువుల్లో నైపుణ్యం పెరుగుతాయి. అందుకే చిన్నప్పుడే వ్యాయామం చేయడం అలవాటు చేయాలి. అది జీవితాంతం కొనసాగటానికి అవకాశం ఉంటుంది. పిల్లలకు ఆటలంటే ఇష్టం. ఇవీ వ్యాయామాలుగా ఉపకరిస్తాయి. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిని పెంచే నడక, పరుగు, ఈత, ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌, టెన్నిస్‌, డ్యాన్స్‌.. ఇలాంటివేవైనా ఎంచుకోవచ్చు. అలాగే కాస్త కష్టమైన వ్యాయామాలను వారానికి కనీసం మూడు రోజుల పాటైనా చేసేలా చూసుకోవాలి. 3 నుంచి 5 ఏండ్ల పిల్లలనైతే రోజంతా చురుకుగా కదిలేలా, రకరకాల ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించాలి.   కొవిడ్‌ నేపథ్యంలో ఇంట్లోంచి బయటికి వెళ్లడానికి వీలులేదు కాబట్టి, పిల్లలు ఎక్కువసేపు ఒకే దగ్గర కూర్చోకుండా చూడటం ముఖ్యం. ఇంట్లో పనుల్లో సాయం చేయమనండి. రోజూ పొద్దున్నే యోగా ప్రాక్టీస్‌ చేయించండి. సూర్యనమస్కారాలూ మంచి వ్యాయామాలుగా పనిచేస్తాయి. ఏమాత్రం అవకాశమున్నా మీతోపాటు వాకింగ్‌కి తీసుకెళ్లండి. ఇలా, ఏదో ఒకలాగా శారీరక శ్రమ చేసేలా జాగ్రత్తపడండి. 


logo