ఆదివారం 24 జనవరి 2021
Zindagi - Jul 19, 2020 , 00:29:28

కరోనా రహిత ఏటీఎంలు

కరోనా రహిత  ఏటీఎంలు

చేతిలో డబ్బులేకుంటే రోజు గడువదు. కరోనాతో బ్యాంకుకు వెళ్లాలంటే ఎవరికైనా కరోనా ఉంటుందేమోన్న భయం. కనీసం ఏటీఎంలోనైనా తెచ్చుకుందామంటే కరోనా కారణంగా ఏ వస్తువునూ ముట్టుకొనే పరిస్థితి లేదు. దాంతో కరోనా అంటుకోని ఏటీఎంల రూపకల్పనలో పరిశోధకులు తలమునకలయ్యారు. సాధారణ ఏటీఎం అయితే కీప్యాడ్‌ ముట్టుకోవాలి. అవసరమైన కీలు నొక్కాలి. కానీ ఏజీఎస్‌ ట్రాన్సాక్ట్‌ టెక్నాలజీస్‌ అనే పేమెంట్‌ సొల్యూషన్స్‌ కంపెనీ ముట్టుకోకుండానే డబ్బులిచ్చే ఏటీఎంను తయారుచేసింది. క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా పనిచేసే ఈ ఏటీఎం కోసం బ్యాంకుల్లో చిన్నపాటి సాఫ్ట్‌వేర్‌ మార్పులు చేసుకుంటే సరిపోతుంది. కస్టమర్లు తమ బ్యాంకు యాప్‌ను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. డబ్బు తీసుకోవాలంటే ఏటీఎంకు వెళ్లి యాప్‌ ఓపెన్‌ చేసి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌చేసి కొన్ని స్టెప్స్‌ ఫలో అయితే డబ్బు తీసుకోవచ్చు. 


logo