బుధవారం 12 ఆగస్టు 2020
Zindagi - Jul 12, 2020 , 00:00:14

11 ఏండ్ల బాలికకు డయానా అవార్డు

11 ఏండ్ల బాలికకు డయానా అవార్డు

ఢిల్లీకి చెందిన 11 ఏండ్ల బాలిక సమికా గుప్తా.. ప్రతిష్ఠాత్మక డయానా అవార్డును అందుకున్నారు. ఢిల్లీ మురికివాడల్లోని పిల్లల అభ్యున్నతి కోసం ఆమె ఎంతో కృషిచేస్తున్నారు. ‘అనుకూలన్‌' అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహిస్తున్న చైల్డ్‌-టు-చైల్డ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా సమికా గుప్తా.. ఢిల్లీ మురికివాడల్లోని పిల్లలకు టీచర్‌గా మారారు. చదువొక్కటే తమ జీవితాలను మార్చగలదని చెప్తూ.. వారిలో చదువు పట్ల ఆసక్తిని పెంచుతున్నారు. అలాగే ఆహారం, దుస్తులు, పుస్తకాలు, బొమ్మలు సేకరించి అక్కడి పిల్లలకు పంపిణీ చేస్తున్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా డయానా అవార్డు లభించింది. ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ డయానా జ్ఞాపకార్థం బ్రిటన్‌ ఈ అవార్డులను ప్రదానం చేస్తున్నది. ఈ ఏడాది మన దేశం నుంచి 15 మంది ఈ అవార్డుకు ఎంపికయ్యారు. కరోనా నేపథ్యంలో ఈసారి వర్చువల్‌గా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. 


logo