మంగళవారం 11 ఆగస్టు 2020
Zindagi - Jul 08, 2020 , 09:18:08

సజ్జ నమక్‌ పార

సజ్జ నమక్‌ పార

ఇమ్యూనిటీ ఫుడ్‌

కావలసిన పదార్థాలు :

సజ్జ పిండి : 200 గ్రా.

మైదా : 50 గ్రా

ఉప్పు : చిటికెడు

నూనె : వేయించడానికి సరిపడా

వాము : 10 గ్రా.

నీళ్ళు : 150 గ్రా.

తయారీ విధానం :

వామును పొడి చేసుకొని సజ్జ పిండిలో కలపాలి. పిండిలో మిగతా అన్ని పదార్థాలూ వేసి రెండు టేబుల్‌ స్పూన్ల నూనె, తగినంత వేడి నీళ్ళు పోసుకొని పూరీ పిండిలా కలుపుకోవాలి. చిన్న చిన్న ఉండలు పూరీలా ఒత్తి, కావలసిన ఆకారంలో కట్‌ చేసుకొని.. కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా దోరగా వేయించి తీయాలి.

పోషకాలు (100గ్రా.లో):

ప్రొటీన్స్‌ : 5.4 గ్రా.

కొవ్వు : 47.9 గ్రా.

పీచు పదార్థం : 1.10 గ్రా.

పిండి పదార్థం : 33.8 గ్రా.

శక్తి : 589.4 కి.క్యాలరీలు

క్యాల్షియం : 40.9 మి.గ్రా.

ఇనుము : 2.8 మి.గ్రా.


logo