మంగళవారం 11 ఆగస్టు 2020
Zindagi - Jul 01, 2020 , 23:57:18

అమ్మ శిక్షణతో..ఒలింపిక్స్‌ పతకం సాధిస్తా

అమ్మ శిక్షణతో..ఒలింపిక్స్‌ పతకం సాధిస్తా

‘నా కెరీర్‌లో ఎన్ని ఒడుదొడుకులు వచ్చినా వెన్నుతట్టి ప్రోత్సహించేదీ... నాలోని నైపుణ్యాలకు మెరుగులు దిద్దేదీ, వైఫల్యంతో కుంగిపోయినప్పుడు ధైర్యం చెప్పేదీ మా అమ్మే. తన శిక్షణలోనే ఒలింపిక్స్‌ పతకం సాధిస్తా’ అని అంటున్నది పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆర్చరీ క్రీడాకారిణి బొంబాయిలా దేవి లైశ్రామ్‌. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ముంబయి జాతీయ శిక్షణ శిబిరాన్ని మూసివేయడంతో తను ఇంటికి చేరుకుంది. ఇంఫాల్‌లో  తల్లి జమిని దేవి నేతృత్వంలో శిక్షణ పొందుతున్నది. ఆమె స్థానికంగా విలువిద్య శిక్షకురాలు. బాల్యం నుంచీ కూతురిని ఆమే తీర్చిదిద్దారు. పదిహేనేండ్ల కెరీర్‌లో ఒక్క ఒలింపిక్‌ పతకం మినహా ప్రతీ పతకాన్నీ గెలుచుకున్నది లైశ్రామ్‌. తక్షణ లక్ష్యం ఒలింపిక్సే! logo