శనివారం 04 జూలై 2020
Zindagi - Jul 01, 2020 , 00:08:05

సీఎస్‌ మేడమ్‌!

సీఎస్‌ మేడమ్‌!

పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైన తొలి మహిళగా వినీ మహాజన్‌ రికార్డు సృష్టించారు. ఈమె భర్త దినకర్‌ గుప్తా ఇప్పటికే.. ఆ రాష్ర్టానికి డీజీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రొటోకాల్‌ పరంగా.. డీజీపీతో పోలిస్తే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే ఓ మెట్టు పైన ఉంటారు. ఆ ప్రకారంగా.. పంజాబ్‌కు సంబంధించి ఆమె నంబర్‌ వన్‌ ఉద్యోగి అయితే, ఆయన నంబర్‌ టూ! 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అయిన వినీ మహాజన్‌ 36 సంవత్సరాల సుదీర్ఘ సర్వీసులో పలు కీలక బాధ్యతలు పోషించారు. మాజీ ప్రధాని డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ కార్యాలయంలో ఆర్థిక, పరిశ్రమలు, వాణిజ్యం, టెలికాం శాఖల వ్యవహారాలను పర్యవేక్షించారు. ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో భారత్‌  తరఫున జి-20 సదస్సులో పాల్గొన్నారు. ఆమె తండ్రి కూడా ఐఏఎస్‌ అధికారిగా సేవలు అందించారు.  logo