శనివారం 04 జూలై 2020
Zindagi - Jul 01, 2020 , 00:07:15

అబ్బే.. ఇప్పుడొద్దు!

అబ్బే.. ఇప్పుడొద్దు!

కొవిడ్‌-19 కారణంగా ప్రపంచమంతా లాక్‌డౌన్‌ అయిపోయింది. దీంతో దంపతులు ఇండ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో, వచ్చే సంవత్సరం జననాల రేటు బాగా పెరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌ అంతర్జాతీయంగా నిర్వహించిన సర్వే ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎక్కువమంది దంపతులు పిల్లల్ని కనడానికి విముఖంగా ఉన్నారని సర్వేలో తెలిసింది. అరవైశాతానికి పైగా వివాహితులు కరోనా సంక్షోభం సమసిపోయేదాకా బిడ్డల్ని కనకూడదనే నిర్ణయించుకున్నారట. పన్నెండేండ్ల నాటి ఆర్థిక మాంద్యం ప్రభావాన్ని వాళ్లలో ఎవరూ మరచిపోలేదు. నిజానికి, ప్రస్తుత పరిస్థితి గతంలో కంటే తీవ్రంగా ఉంది. అందర్నీ ఉద్యోగ అభద్రత వెంటాడుతున్నది. తమ జీవితాలకే దిక్కు లేనప్పుడు మరో ప్రాణిని భూమి మీదికి తీసుకురావడం అవసరమా? అన్న ప్రశ్న ఉదయిస్తున్నది. కొలువుల కోతల తర్వాత అంతగా భయపెడుతున్న సమస్య.. అనారోగ్యభయం. 1918లో స్పానిష్‌ ఫ్లూ కారణంగా 15 శాతం జననాల రేటు తగ్గిందని పాత లెక్కలు చెబుతున్నాయి. ఆ గణాంకాలే పునరావృతం కావచ్చు.logo