సోమవారం 06 జూలై 2020
Zindagi - Jun 30, 2020 , 00:06:14

నాసా కార్యాలయానికి..నల్లజాతి మహిళ పేరు!

నాసా కార్యాలయానికి..నల్లజాతి మహిళ పేరు!

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. నాసా ప్రధాన కార్యాలయానికి ఓ ఆఫ్రో అమెరికన్‌ పేరు పెట్టాలని నిర్ణయించారు. నాసాలో పనిచేసిన తొలి నల్లజాతి ఇంజినీర్‌గా రికార్డులకెక్కిన ‘మేరీ జాన్సన్‌'కు ఈ అరుదైన గౌరవం దక్కింది. వర్జీనియా రాష్ట్రంలో ఏప్రిల్‌ 9, 1921న జన్మించిన మేరీ జాక్సన్‌, నల్లజాతివారిపై తీవ్ర వివక్ష ఉన్న సమయంలోనూ చదువుల్లో రాణించారు. 1958లో ‘నాసా’లో ఉద్యోగం సంపాదించారు.  అమెరికన్‌ వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లడంలోనూ కీలక పాత్ర పోషించారు. 2016లో వచ్చిన హాలీవుడ్‌ సినిమా ‘హిడెన్‌ ఫిగర్స్‌'కు మేరీ జాక్సన్‌ కథే ప్రేరణ. అప్పట్లో వాషింగ్టన్‌ డీసీలో నాసా ప్రధాన కార్యాలయం ఉన్న వీధికి ‘హిడెన్‌ ఫిగర్స్‌ వే’ అని నామకరణం చేశారు. ఇప్పుడు ఏకంగా నాసా ప్రధాన కార్యాలయానికే మేరీ జాక్సన్‌ పేరు పెట్టబోతున్నారు. అమెరికాలో నల్లజాతివారిపై వివక్ష చూపుతున్నారంటూ తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్న తరుణంలో, ఓ ఆఫ్రో అమెరికన్‌ పేరు పెట్టాలని నిర్ణయించడం చర్చనీయమైంది. 


logo