సోమవారం 06 జూలై 2020
Zindagi - Jun 30, 2020 , 00:06:12

పనిమనుషుల కోసం

పనిమనుషుల కోసం

లాక్‌డౌన్‌ కారణంగా, ఎంతోమంది ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌లో ఉన్నారు. కానీ, పని మనుషులకు మాత్రం ఈ అవకాశం లేదు. దీంతో వాళ్లకు అన్నీ కష్టాలే. ధైర్యం చేసి పనికి వెళ్తే కరోనా సోకే ప్రమాదం ఉంది. వెళ్లకపోతే, ఉపాధిని కోల్పోయినట్టే. వెళ్లాలని ఉన్నా కొన్నిసార్లు యజమానులో అపార్ట్‌మెంట్‌ సంఘాలో అనుమతి ఇవ్వడం లేదు. ఈ కష్టాలకు చెక్‌ పెడుతూ సుఖ్‌వీర్‌ కౌర్‌ అనే హైదరాబాద్‌ మహిళ పనిమనుషులు తమను తాము వైరస్‌ నుంచి రక్షించుకోవడానికి నిండైన దుస్తులను తయారు చేశారు. వాటిని చుట్టుపక్కల వారికి ఉచితంగా అందించారు కూడా. తమకూ అలాంటి డ్రెస్‌లు కావాలని చాలామంది కోరుతుండటంతో.. మరిన్ని తయారు చేస్తున్నారు సుఖ్‌వీర్‌.logo