ఆదివారం 05 జూలై 2020
Zindagi - Jun 28, 2020 , 23:49:03

మాస్క్‌నుంచి చర్మాన్ని కాపాడుకోండిలా!

మాస్క్‌నుంచి చర్మాన్ని కాపాడుకోండిలా!

కరోనా కారణంగా మాస్క్‌ నిత్యావసర వస్తువు అయింది. ఎక్కడికి వెళ్లినా తప్పనిసరిగా ధరించాల్సిందే. అయితే ఎక్కువసేపు మాస్క్‌లు ధరించడం వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. వాటినుంచి బయటపడాలంటే ఈ చిట్కాలు పాటించండి.

  • ఎక్కువసేపు మాస్క్‌లు ధరించడం వల్ల వాటి గుర్తులు ముఖంపై అలాగే ఉండిపోతాయి. దానికితోడు అలర్జీ, దద్దుర్లు, ఫంగల్‌ ఇన్ఫెక్షన్స్‌ వచ్చే ప్రమాదం ఎక్కువ. ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టాలంటే టమాటా జ్యూస్‌తో ఫేషియల్‌ ప్రయత్నించండి. మృదువైన, మెరిసే చర్మం కోసం పెరుగు, ముల్తానీ మట్టితో ఫేస్‌ప్యాక్‌ చేసుకోవాలి.
  • దోసకాయ రసంతో ఫేస్‌ప్యాక్‌ చేస్తే.. దద్దుర్లు, అలర్జీల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.
  • ముఖంపై ఏర్పడిన మాస్క్‌ గుర్తులను తొలగించుకునేందుకు పెట్రోలియం జెల్లీని ప్రయత్నించండి. మాస్క్‌ తీసిన తర్వాత, ఈ జెల్లీని మాస్క్‌ గుర్తులపై రాసి ఒక గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి.
  • రోజూ మాస్క్‌ను డిటర్జెంట్‌తో శుభ్రం చేయాలి. దీనివల్ల క్రిములు చర్మంపై దాడి చేయకుండా ఉండటంతో పాటు ముఖానికి సరిపడా తేమ అందుతుంది.
  • మాస్క్‌ ధరించి ఇంటినుంచి బయల్దేరడానికి 45 నిమిషాల ముందు ముఖానికి మాయిశ్చరైజర్‌ రాయండి. ఫలితంగా, చర్మం పొడిబారకుండా తాజాగా ఉంటుంది.
  • రోజూ ఒకే మాస్క్‌ను ధరించకుండా మారుస్తూ ఉండాలి. దీనివల్ల స్కిన్‌ కొల్లాజెన్‌ పాడవదు. ఒకే మాస్క్‌ ధరిస్తే కచ్చితంగా ముఖంపై దాని గుర్తులు కనిపిస్తాయి.
  • ఆఫీసుల్లో ఎక్కువసేపు పనిచేసేవారు తప్పకుండా గాలి పీల్చుకునేందుకు వీలుగా ఉండే మాస్క్‌లే ధరించాలి.


logo