శనివారం 04 జూలై 2020
Zindagi - Jun 28, 2020 , 23:49:07

ఆన్‌లైన్‌తో చురుకుదనం తగ్గొచ్చు!

ఆన్‌లైన్‌తో చురుకుదనం తగ్గొచ్చు!

ఇన్నాళ్లూ పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు ఇప్పుడు ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లలో చదువుతున్నారు. కారణం, లాక్‌డౌన్‌తో ఆన్‌లైన్‌ చదువు ప్రాధాన్యం సంతరించుకోవడమే. ఈ తరహా విద్యావిధానంతో విద్యార్థుల్లో చురుకుదనం తగ్గుతుందట. అంతేకాదు, చదివే సామర్థ్యం క్రమంగా క్షీణిస్తుందని అంటున్నారు జేఎన్టీయూ (కాకినాడ) రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ మేజర్‌ ఎస్‌ భక్తియార్‌ చౌదరి. వీటితోపాటు పిల్లలు ఉపయోగించే గ్యాడ్జెట్లతో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయనీ అంటున్నారాయన. హైదరాబాద్‌లో తాజాగా 10-17 యేండ్ల వయసున్న 186 మంది విద్యార్థులపై భక్తియార్‌ చౌదరి బృందం అధ్యయనం జరిపింది. ఇందులో ఎన్నో విషయాలు గమనించామన్నారు. ఆన్‌లైన్‌ తరగతుల వల్ల పిల్లల ప్రవర్తనాతీరు కూడా మారినట్టు గుర్తించారు. 

పిల్లలు కూర్చోవడం దగ్గర్నుంచి, వారు గ్యాడ్జెట్లను వాడుతున్న తీరు, తీసుకుంటున్న విరామాలు, స్క్రీన్‌ను ఎక్కువసేపు చూసే విధానం, ఆ సమయంలో తినే పద్ధతి.. వంటి ఎన్నో విషయాలను పిల్లల తల్లిదండ్రుల నుంచీ రాబట్టారు. తరగతి గదిలో తోటి విద్యార్థులతో కలిసి చదువుకున్నంత చురుకుదనం ఈ ఆన్‌లైన్‌ తరగతుల్లో కనిపించడం లేదని అన్నారు భక్తియార్‌ చౌదరి. logo