ఆదివారం 05 జూలై 2020
Zindagi - Jun 26, 2020 , 00:28:03

కఫ్తాన్‌.. ఇదొక హాట్‌ ట్రెండ్‌!

కఫ్తాన్‌.. ఇదొక హాట్‌ ట్రెండ్‌!

మహిళల ఫ్యాషన్‌ ప్రపంచానికి పరిమితులు అంటూ ఉండవు. రోజుకో కొత్తట్రెండ్‌ వస్తూ.. ప్రపంచాన్ని అలా ఊపేస్తుంటుంది. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్‌ ‘కఫ్తాన్‌'. వీటిని బాలీవుడ్‌ తారలు విరివిగా ధరిస్తుండటంతో ఎక్కడలేని క్రేజ్‌ వచ్చింది. ఆన్‌లైన్‌లోనూ వీటి గురించి మగువలు ఆరా తీస్తున్నారు. 

బాలీవుడ్‌ హీరోయిన్ల సోషల్‌మీడియా ఖాతాల్ని ఒకసారి పరిశీలిస్తే.. మెడ నుంచి కాళ్లవరకూ నిలువెల్లా ఒకే రంగు దుస్తుల్లో కనిపిస్తారు. ఇవే కఫ్తాన్లు!  వదులుగా ఉండటంతో చాలా సౌకర్యంగా ఫీలవుతారు. ఇంట్లోనూ, ఫంక్షన్లకు ..ఎక్కడికైనా అనువుగా ఉంటాయి. అందుకేనేమో హీరోయిన్లు కూడా కఫ్తాన్‌ డ్రెస్‌లపై మనసు పారేసుకుంటున్నారు. వానాకాలంలో ధరించడానికి సౌకర్యంగా ఉంటాయని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ గరిమా అగర్వాల్‌ చెబుతున్నారు. దీపికా పదుకొణె, కరీనాకపూర్‌, మలైకా అరోరా, నీనాగుప్తా తదితరులు కఫ్తాన్స్‌ వీరాభిమానులే. సీతాకోక చిలుక రెక్కలు విచ్చుకున్నట్టు... కఫ్తాన్లు అందంగా కనిపిస్తున్నాయని కరీనాకపూర్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫ్యాషన్‌ ప్రపంచంలో ప్రస్తుతం కఫ్తాన్‌దే ఆధిపత్యం.  వయసుతో సంబంధం లేకుండా వీటిని ధరిస్తున్నారు. 


logo