ఆదివారం 05 జూలై 2020
Zindagi - Jun 26, 2020 , 00:28:04

కార్పొరేట్‌ ఆఫీస్‌.. కేరాఫ్‌ స్టార్‌ హోటల్‌

కార్పొరేట్‌ ఆఫీస్‌.. కేరాఫ్‌ స్టార్‌ హోటల్‌

కరోనా కాలంలో అధికశాతం కార్పొరేట్‌ ఆఫీసులు తమ కార్యకలాపాలను హోటళ్ల  నుంచే  నిర్వహిస్తున్నాయి. ఈ వ్యవహారం అటు స్టార్‌ హోటళ్లకు, ఇటు కార్పొరేట్‌ సంస్థలకు లాభదాయకంగా ఉంటున్నది. 

కరోనాతో పర్యాటకులు, సందర్శకులు లేక స్టార్‌ హోటళ్లన్నీ బోసిపోతున్నాయి. మరోవైపు కార్పొరేట్‌ సంస్థలు కూడా కార్యాలయాల నిర్వహణ, అద్దెల భారంతో సతమతమవుతున్నాయి. ఈక్రమంలో స్టార్‌ హోటళ్లలో ఆఫీసుల నిర్వహణకు మొగ్గుచూపుతున్నారు కార్పొరేట్‌ సంస్థల నిర్వాహకులు. తక్కువ ధరల్లోనే అద్దె ప్యాకేజీలు ఉండటంతోపాటు ఫుడ్‌, క్లీనింగ్‌, శానిటైజేషన్‌, సెక్యూరిటీ, హౌస్‌కీపింగ్‌, పార్కింగ్‌, వైఫై తదితర సౌకర్యాలన్నీ  అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం అద్దె భవనాల కంటే 40 శాతం తక్కువకే హోటళ్లలో రూమ్స్‌ లభిస్తున్నాయి. ఫలితంగా ముంబయి, కోల్‌కతా, బెంగళూరు ప్రాంతాల్లోని అనేక కార్పొరేట్‌ ఆఫీసులు స్టార్‌ హోటళ్లకు తరలిపోయాయి. హోటల్‌లో సంస్థ కార్యకలాపాల నిర్వహణతో ఒక్క నెలలోనే రూ.50లక్షలు ఆదా చేసినట్టు ఓ కార్పొరేట్‌ క్లయింట్‌ చెబుతున్నారు. ఇటు స్టార్‌ హోటళ్ల వారికి కూడా ఈ ప్రతిపాదన లాభదాయకంగా ఉందని అంటున్నారు. logo