శనివారం 04 జూలై 2020
Zindagi - Jun 26, 2020 , 00:28:04

అవార్డుల‘హైవే’..

అవార్డుల‘హైవే’..

  • మాజీ బస్‌ కండక్టర్‌కు ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ పురస్కారం

ఉద్యోగ రీత్యా రహదారులపై తానుచేసిన ప్రయాణాలను ఆధారం చేసుకొని తీసిన చిత్రం.. ఓ మాజీ బస్‌ కండక్టర్‌కు ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డును తెచ్చిపెట్టింది. డాక్యుమెంటేరియన్‌, సినిమాటోగ్రఫర్‌ అయిన అమర్‌ మైబమ్‌, గతంలో బస్‌ కండక్టర్‌గా పనిచేశాడు. ఇంఫాల్‌-మోరేహ్‌ రహదారిపై గుండా అనేకసార్లు ప్రయాణించాడు. ఈ క్రమంలో ట్రక్‌ డ్రైవర్ల జీవితాలను దగ్గర నుంచీ గమనించాడు. 

మణిపూర్‌ ప్రజల మెరుగైన జీవనం కోసం ట్రక్‌ డ్రైవర్లు చేస్తున్న త్యాగాలను తడుముతూ  52 నిమిషాల నిడివి గల ‘హైవేస్‌ ఆఫ్‌ లైఫ్‌' చిత్రాన్ని నిర్మించాడు. బంగ్లాదేశ్‌లోని ఢాకాలో ఇటీవల నిర్వహించిన 8వ లిబరేషన్‌ డాక్యుమెంటరీ ఉత్సవంలో ఈ సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. 124 దేశాల నుంచి 1800 చిత్రాలు రాగా, భారతదేశం తరఫున ఎంపికైన ఏకైక చిత్రంగా ‘హైవేస్‌ ఆఫ్‌ లైఫ్‌' నిలిచింది. మణిపూర్‌లో జరిగిన 2020 స్టేట్‌ ఫిలిమ్‌ అవార్డుల్లోనూ బెస్ట్‌ నాన్‌ఫీచర్‌ సినిమా, బెస్ట్‌ డైరెక్షన్‌, బెస్ట్‌ సినిమాటోగ్రఫీ, బెస్ట్‌ ఎడిటింగ్‌ విభాగాల్లో అవార్డులు సాధించింది. 


logo