గురువారం 04 మార్చి 2021
Zindagi - Jun 24, 2020 , 00:28:14

అద్భుత శిల్ప సౌందర్యం

అద్భుత శిల్ప సౌందర్యం

అపురూప విగ్రహాలతో అలరారుతున్న ‘సోమేశ్వరాలయం’

ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరిచెల్మ సోమేశ్వరాలయం, ఆధ్యాత్మికంగానూ, అద్భుత శిల్పకళా సౌందర్యంతోనూ అలరారుతున్నది. ఇటు ప్రకృతి సౌందర్యానికి, అటు చారిత్రక ప్రాధాన్యానికి అద్దం పడుతున్నది. పురాతన జలాశయం మధ్యలో కాకతీయులు నిర్మించిన ఈ ఆలయం, పర్యాటకంగానూ ఆకట్టుకుంటున్నది. సూర్యుని కిరణాలు నంది విగ్రహాన్ని తాకుతూ, గర్భగుడిలోని శివలింగంపై ఏటవాలుగా జాలువారడం ఈ ఆలయానికున్న ప్రత్యేకత. దీంతోపాటు వేరే ఏ ఆలయాల్లోనూ కనిపించని కొన్ని అపురూప శిల్పాలు ఇక్కడ దర్శనమిస్తున్నాయి.

ఏడు పడగలతో ఉన్న పాము రూపంలోని శివుడి విగ్రహం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఆంజనేయుడు, శనీశ్వరుడు కలిసి ఉన్న అరుదైన విగ్రహం మరో ప్రత్యేకత. ఆంజనీ సుతుడి పాదాల చెంత శనిదేవుడు దర్శనమివ్వడం విశేషం. జైన విగ్రహాలు, చతుర్ముఖుడైన జైన తీర్థంకరుడు, ధ్యాన ముద్రలో ఉన్న బుద్ధుడి ప్రతిమలు ఇక్కడ దర్శనమిస్తాయి. ఏటా మహాశివరాత్రి తరువాత వచ్చే పంచమి నుంచి ఏడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తారు. వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి, స్వామివారిని దర్శించుకుంటారు. 


VIDEOS

logo