శనివారం 04 జూలై 2020
Zindagi - Jun 22, 2020 , 01:49:56

అ‘పూర్వ’ సాయం

అ‘పూర్వ’ సాయం

వాళ్లంతా ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ పూర్వ విద్యార్థినులు. ప్రస్తుతం కోల్‌కతా, ముంబై, చెన్నై తదితర నగరాల్లో స్థిరపడ్డారు. చాలా రోజుల తర్వాత అందరూ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంతా కలిసి కొవిడ్‌ వల్ల ఇబ్బందులు పడుతున్న పేదలకు, వలస కార్మికులకు సాయం చేయాలని తీర్మానించారు. దీనివెనకో చిన్న సంఘటన ఉంది. దీపా క్రిష్ణన్‌..ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. మురికివాడల జనం తిండికి ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని వారికి ఆహారం అందించారు. ఆ చిత్రాలను వాట్సాప్‌లో మిత్రులతో పంచుకున్నారు. ఐఐఎం సహవిద్యార్థులంతా స్పందించారు. తలాకొంత పోగేశారు. ఆ డబ్బుతో సుమారు 176 మంది మహిళలకు సాయం చేశారు. వలస కార్మికులను ఇంటికి చేర్చారు. మాస్కులు పంపిణీ చేశారు. కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేశారు. పూర్వ విద్యార్థుల సమావేశాలు చాలావరకూ గత జ్ఞాపకాల్ని నెమరేసుకోవడానికే పరిమితం అవుతారు. వీళ్లు మాత్రం భవిష్యత్తులోనూ గుర్తుండిపోయే మంచి పని చేశారు.  logo