ఆదివారం 05 జూలై 2020
Zindagi - Jun 21, 2020 , 00:22:50

పల్స్‌ ఆక్సిమీటర్‌తోనూ కరోనా టెస్ట్‌

పల్స్‌ ఆక్సిమీటర్‌తోనూ కరోనా టెస్ట్‌

కరోనా కారణంగా మాస్కులు, శానిటైజర్లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. వైరస్‌ బారిన పడకుండా ఇవి కాపాడతాయని తెలుసు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా వైరస్‌ సోకి ఉండవచ్చేమో, అసలే లక్షణాలు లేకుండా ఉంటోంది.. లోలోపలే ముదిరితే ఎలా అన్న అనుమానం ఎంతో మందిలో ఉంటుంది. 

దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలంటేనేమో భయం. ఈ నేపథ్యంలోనే పల్స్‌ ఆక్సీమీటర్‌కు కూడా డిమాండ్‌ పెరుగుతున్నది. పల్స్‌ ఆక్సీమీటర్‌కు, కొవిడ్‌ పరీక్షకు సంబంధం ఏంటనుకుంటున్నారా.. పల్స్‌ ఆక్సీమీటర్‌ రక్తంలోని ఆక్సిజన్‌ స్థాయిని తెలుపుతుంది. కొవిడ్‌ రోగుల్లో ఆక్సిజన్‌ స్థాయి తీవ్రంగా పడిపోతుంది. అంటే ఆక్సిజన్‌ స్థాయిని చూస్తే వైరస్‌ సోకిందా.. లేదా అన్నదానిపై ఒక అవగాహన వస్తుంది. రక్తంలో  95 శాతం ఆక్సిజన్‌ ఉంటుంది. కొవిడ్‌ రోగుల్లో ఇది 40శాతానికి పడిపోతుంది. మామూలు వ్యక్తిలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గినప్పుడు శ్వాస ఆడదు. అయితే కొవిడ్‌ రోగుల్లో ఈ పరిస్థితి ఉండదు. ఈ సమయంలోనే ఆక్సీ మీటర్‌ చాలా కీలకం. దీనిని వేలికి పెట్టుకుంటే కేవలం 6-12 సెకండ్లలో ఫలితం తెలుస్తుంది. విశ్రాంతి సమయంలో పరీక్షించుకోవాలి. కరోనా సోకి హోం క్వారంటైన్‌లో ఉన్నవారికి ఇది చాలా ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరీక్షించుకోవడం ద్వారా ఆరోగ్య పరిస్థితని తెలుసుకోవచ్చని అంటున్నారు. హౌజింగ్‌ సొసైటీల్లో కనీసం ఒక్కటైనా ఆక్సీమీటర్‌ కొనుక్కుంటే బాగుంటుందని చెప్తున్నారు.


logo