శనివారం 04 జూలై 2020
Zindagi - Jun 17, 2020 , 23:46:14

ఇలా.. ప్రేమతో!

ఇలా.. ప్రేమతో!

బుల్లితెర నటులు, బిగ్‌బాస్‌ కంటెస్టెంట్లు లాక్‌డౌన్‌తో ఇంట్లోనే బందీలయ్యారు. అయితేనేం, పెంపుడు జంతువులతో హ్యాపీగా గడుపుతున్నామని సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు చెబుతున్నారు. ఆ ఫొటోలను కూడా విడుదల చేస్తున్నారు. బిగ్‌బాస్‌-3 విజేత, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ తన అమెరికన్‌ డాగ్‌ ‘చిచా’తో, బిగ్‌బాస్‌-2 విజేత కౌశల్‌ తన స్పానియల్‌ పప్పీ ‘లిప్సీ’తో...బిగ్‌బాస్‌-3 ఫేం హిమజ తన బంగారుకొండ ‘రియో’తో..నటి వితిక ముద్దులు మూటగట్టే ‘బ్రూనో’తో, యాంకర్‌ సుమ తన జిందగీ ‘జొర్రో’తో, రంగమ్మత్త అనసూయ ఆస్ట్రేలియా పక్షి ‘హ్యాపీ’తో.. రష్మీ తన డియరెస్ట్‌ ‘బంబుల్‌'తో బిజీబిజీగా గడుపుతున్నారు. వాటికి స్నానం చేయిస్తూనో, వాటితో సరదాగా ఆడుకుంటూనో ఫొటోలు తీసుకుంటున్నారు. ఇప్పుడు అవన్నీ నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. 
logo