శనివారం 04 జూలై 2020
Zindagi - Jun 17, 2020 , 23:46:14

ఆటోనే.. అంబులెన్స్‌గా!

ఆటోనే.. అంబులెన్స్‌గా!

కరోనా.. అన్న మాట వినిపిస్తే చాలు ఆమడదూరం పరుగెడుతున్న రోజులివి. కరోనా రోగులను దవాఖానకు చేర్చాలన్నా.. డిశ్చార్జి అయినవారిని ఇంటికి తీసుకెళ్లాలన్నా.. కరోనాతో చనిపోయిన వారిని శ్మశానానికి తరలించాలన్నా అంబులెన్స్‌లు  ముందుకు రాని దుస్థితి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మణిపూర్‌ తొలి మహిళా ఆటోడ్రైవర్‌ లైబీ ఓనమ్‌ ధైర్యం చేసింది. తన ఆటోను అంబులెన్స్‌గా మార్చి, రోగులకు సేవ చేస్తున్నది.

మణిపూర్‌ తొలి మహిళా ఆటోడ్రైవర్‌ అనగానే గుర్తుకొచ్చే పేరు లైబీ ఓనమ్‌. ఈమె కష్టాన్ని, విజయగాథను అప్పట్లో కథలుగా చెప్పుకొన్నారు. లైబీ.. మరోసారి వార్తల్లో  నిలిచింది. మనసున్న మహిళగా, మానవత్వం ఉన్న వ్యక్తిగా తన ఆటోలో కరోనా రోగులను గమ్యానికి చేరుస్తున్నది. ఇటీవల ఓ వ్యక్తిని తన ఆటోలో వంద కిలోమీటర్లు తీసుకెళ్లి మరీ సురక్షితంగా ఇంటికి చేర్చింది. దాదాపు ఎనిమిది గంటలు అతడితోనే ప్రయాణించింది. అలాగే, ఇటీవల కరోనా నుంచి కోలుకున్న ఓ బాలికను ఇంటి దగ్గర దిగబెట్టింది. ఇలా ఎంతోమంది రోగులను మానవతా దృక్పథంతో గమ్యాలకు చేరవేస్తున్న లైబీ ఓనమ్‌ గురించి తెలిసి ముఖ్యమంత్రి ఎన్‌.బీరెన్‌ సింగ్‌ స్వయంగా అభినందించారు. 


logo