శనివారం 04 జూలై 2020
Zindagi - Jun 17, 2020 , 23:46:13

కొవిడ్‌పై కలెక్టరమ్మ విజయం

కొవిడ్‌పై కలెక్టరమ్మ విజయం

అన్నీస్‌ కన్మణిది కేరళ. కర్ణాటక కేడర్‌ ఐఏఎస్‌. కొడగు జిల్లా అధికారిగా రాకముందు తుమకూరు జిల్లా పరిషత్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. వరదల సమయంలో జిల్లాలో ఎలాంటి లోపమూ లేకుండా బాధితులకు సాయం అందించారు. ఇప్పుడు కొవిడ్‌-19 నియంత్రణలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆ జిల్లాలో తొలి కేసు మార్చి 29న నమోదైంది. వెంటనే స్పందించిన కలెక్టరమ్మ, కాంటాక్టులున్న అందరినీ క్వారంటైన్‌కు తరలించారు. ప్రజల్లో ఆ క్రిమిపట్ల అవగాహన కల్పించారు.  గత 28 రోజులలో ఒక్క కేసూ నమోదు కాలేదు. కొవిడ్‌ కేసులు నమోదుకాని జిల్లాల జాబితాలోకి కొడగు చేరింది. కన్మణి నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. తండ్రి సాధారణ రైతు. ఎన్నో కష్టాలను తట్టుకుని పెద్ద చదువులు చదివారు.


logo