శనివారం 04 జూలై 2020
Zindagi - Jun 02, 2020 , 22:53:14

కంగనా.. కలల ఆఫీస్‌

కంగనా.. కలల ఆఫీస్‌

డాక్టర్‌ అవుదామనుకుంది. కానీ కెమిస్ట్రీ సబ్జెక్ట్‌లో ఫెయిలయ్యింది. మోడల్‌ అవుదామనుకుంది. అయితే, ఆ రంగానికి అవసరమైనంత సృజనాత్మకత తనకు లేదనుకుంది. చివరగా, థియేటర్‌ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది. స్టేజీపై ఇరగదీసింది.  ప్రేక్షకుల చప్పట్లు ఆమెను సినిమాల వైపు నడిపించాయి. ఆకలి, అర్థిక కష్టాలూ అనుభవించింది. ‘ఒక్క ఛాన్స్‌' కోసం ప్రయత్నించింది. ప్రస్తుతం కంగన నటి మాత్రమే కాదు, బిలియనీర్‌. పురుషాధిక్య వ్యవస్థలో రాణిస్తున్న ధీశాలి. ప్రతిభను నమ్ముకొని ముంబై నగరానికి వచ్చిన కంగన తాజాగా తన కలల సౌధాన్ని నిర్మించుకున్నది. రూ.48 కోట్లతో ఓ ఖరీదైన ఆఫీసును ప్రారంభించింది. మణికర్ణిక ఆఫీస్‌ కమ్‌ స్టూడియోలో స్టోరీ డిస్కషన్స్‌, వీడియోల రూపకల్పన, యాడ్‌ఫిల్మ్స్‌ షూటింగ్స్‌.. ప్రతి పనికీ ఓ ప్రత్యేక విభాగం ఉంది. గోడలపై ప్రేరణనిచ్చే కోట్స్‌ కనిపిస్తాయి. ‘50 ఏండ్లు వచ్చేసరికి ప్రపంచంలో అత్యంత ధనవంతురాలిని కావడమే నా లక్ష్యం’ అంటున్నది కంగనా. ఆల్‌ దిబెస్ట్‌ మేడమ్‌!logo