ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న కన్నడ సోయగం రష్మిక మందన్నాకు పెద్ద ఎత్తున విషెస్ అందుతున్నాయి. రష్మిక కోస్టార్, మాజీ బాయ్‌ఫ్రెండ్ రక్షిత్‌శెట్టి ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన కిరీక్పార్టీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో తీసిన వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేశాడు రక్షిత్‌శెట్టి. రష్మిక కెరీర్ లో ఉన్నత స్థానానికి వెళ్లడం సంతోషంగా ఉందన్నాడు రక్షిత్.
కిరీక్ పార్టీ సినిమా ఆడిషన్స్ లో నీ అందమైన జ్ఞాపకాలు. నువ్వు అప్పటి నుంచి చాలా దూరం ప్రయాణించావు. నిజమైన వారియర్ లా నీ కలలను ఛేదిస్తున్నావు. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు మరిన్ని విజయాలను అందుకోవాలని ఆశిస్తున్నానని ట్వీట్ చేశాడు రక్షిత్‌శెట్టి. కిరీక్పార్టీ కోస్టార్స్ అయిన రష్మిక, రక్షిత్ గతంలో చాలా గ్రాండ్‌గా నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అయితే పలు కారణాలతో రక్షిత్-రష్మిక తమ పెండ్లిని రద్దు చేసుకున్నారు. ఈ ఇద్దరూ ప్రొఫెషనల్‌గా తమ తమ సినిమాలతో బిజీ అయిపోయారు.