శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Zindagi - May 28, 2020 , 23:00:36

బీట్‌రూట్‌తో కళ్లకు మెరుపు

బీట్‌రూట్‌తో కళ్లకు మెరుపు

‘కూరల్లోని కరివేపాకును పడేయొద్దు.. అది కంటిచూపును బాగుచేస్తుంది... ఆకుకూరలు బాగా తింటే కళ్లద్దాలు రాకుండా ఉంటాయి’.. ఇలా పిల్లలకు మనం చెప్తూ ఉంటాం. అయితే, ఇలాంటి ఆహారం పెద్దల కళ్లకూ ఆరోగ్యాన్నిఇస్తుందంటున్నారు పరిశోధకులు. ఈ కూరగాయల్లో ఉండే నైట్రేట్స్‌... మాక్యులర్‌ డీజనరేషన్‌ సమస్యను నివారిస్తాయని చెబుతున్నారు. వయసు పెరిగిన కొద్దీ కనిపించే సమస్యల్లో మాక్యులర్‌ డీజనరేషన్‌ ఒకటి. కంటిలోని మాక్యులా భాగంలో సమస్య ఏర్పడటం వల్ల కంటిచూపు దెబ్బతింటుంది. అయిదు పదుల వయసులో కనిపించే దృష్టి సమస్యలకు కూడా మాక్యులర్‌ డీజనరేషనే కారణం. దీన్ని నివారించాలంటే పెద్దవాళ్లు కూడా ఆకుకూరలతోపాటుగా బీట్‌రూట్‌ను తరచుగా తీసుకోవాలని సూచిస్తున్నారు పరిశోధకులు. వంద గ్రాముల పాలకూరలో 20 మిల్లీ గ్రాముల నైట్రేట్‌ ఉంటే, అదే పరిమాణంలోని బీట్‌రూట్‌లో వంద మిల్లీ గ్రాముల వరకూ ఉంటుంది. అందుకే బీట్‌రూట్‌ కూడా కంటి ఆరోగ్యానికి సహాయపడుతుందని బల్లగుద్ది చెప్తున్నారు. logo