శనివారం 30 మే 2020
Zindagi - May 23, 2020 , 23:32:46

అభినవ సావిత్రులు

అభినవ సావిత్రులు

పురాణాల్లో సావిత్రి పాత్ర మనందరికీ తెలిసిందే. యమధర్మరాజు నుంచి భర్త ప్రాణాలు వెనక్కి తెచ్చుకున్నది. ఇప్పటికీ ఆ ఘటనను స్మరిస్తూ మహిళలు వటసావిత్రి వ్రతాలు చేస్తారు. తాజాగా ఒడిషాలోని గంజాం జిల్లా వాసులు ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లారు. లాక్‌డౌన్‌ ప్రకటించాక కాలినడకన స్వగ్రామాలకు చేరుకున్నారు. వీరిని అధికారులు స్థానిక పాఠశాల భవనాల్లో క్వారంటైన్‌లో ఉంచారు. వాళ్లంతా క్షేమంగా ఉండాలని క్వారంటైన్‌ సెంటర్ల వద్దనే వారి జీవిత భాగస్వాములు వటసావిత్రి పూజలు చేశారు. పతిదేవులకు కరోనా కారణంగా ఏ హానీ జరగకూడదంటూ చీర, సారె పంచిపెట్టారు.logo