మంగళవారం 26 మే 2020
Zindagi - May 23, 2020 , 00:10:14

ఇక ఆ ఫొటోలు చూడలేరు!

ఇక ఆ ఫొటోలు చూడలేరు!

సంతోషమైనా, బాధయినా.. అన్నింటినీ పంచుకునేందుకు ఫేస్‌బుక్‌ ఓ వేదిక. లైక్‌లు, కామెంట్ల వరకూ ఓకే. ఆ తర్వాత మీ ఫొటోలు, వీడియోలు ఎవరైనా మార్ఫింగ్‌ చేస్తే.. దుర్వినియోగం అయితే.. కొంప కొల్లేరే! ఇన్నాళ్లూ ఇలాంటి భయాలు చాలానే ఉండేవి. ఇకపై సమస్యే లేదు. ఎందుకంటే, ఫేస్‌బుక్‌ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇది వరకు ఫేస్‌బుక్‌లో మీకు ఫ్రెండ్‌ కాని వారు, మీ ఫ్రెండ్‌ లిస్ట్‌లో లేనివారు కూడా మీ ఫొటోలు, పోస్టులు చూసే అవకాశం ఉండేది. ఇకపై అసాధ్యమే. ‘అన్‌లాక్‌ ప్రొఫైల్‌ పిక్చర్‌' సౌకర్యం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను ఇండియాలో మాత్రమే పరిచయం చేస్తారు. ముఖ్యంగా మహిళల సేఫ్టీ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఫేస్‌బుక్‌ పబ్లిక్‌ పాలసీ డైరెక్టర్‌ అంకిదాస్‌ చెబుతున్నారు. ఈ ఫీచర్‌ అందుబాటులోకి వస్తే ఫ్రెండ్‌ లిస్ట్‌లో లేనివారు. మీ ఫొటోను డౌన్‌లోడ్‌ చేసుకోలేరు. ఫొటోను జూమ్‌ చేయలేరు. మీ పాత- కొత్త పోస్టులు, మీ ఫ్రెండ్‌  జాబితాలు వగైరాల్ని చూడనైనా చూడలేరు.


logo