మంగళవారం 26 మే 2020
Zindagi - May 23, 2020 , 00:10:02

పోస్ట్‌కార్డు ఉద్యమం!

పోస్ట్‌కార్డు ఉద్యమం!

ఒక్కొక్కరిలో ఒక్కో కళ దాగి ఉంటుంది. కొందరిలో అనేక కళలూ ఉండవచ్చు. అవి చిన్నారులకు ఆదర్శం కావచ్చు. 

ప్రియాంక ఉలగనాథన్‌ది చెన్నై. వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్‌. కళల ద్వారా ఉపాధిని, ఆనందాన్ని పొందవచ్చు అని బలంగా నమ్ముతారు. చిన్నారుల్లో కళలపై ఆసక్తిని పెంచేలా, వారికి భవిష్యత్‌పై నమ్మకం కలిగించేలా ఏదైనా చేయాలనుకున్నారు ఆమె. భావితరాలకు వారధిగా నిలిచే ‘పోస్ట్‌కార్డ్‌ ప్రాజెక్ట్‌'ను ప్రారంభించారు. దీని ద్వారా వివిధ రంగాల్లో ప్రవీణులైన వారి నుంచి పోస్ట్‌కార్డులు సేకరిస్తున్నారు. ఈ పోస్ట్‌కార్డుపై వారి ఫొటో, ఆ రంగం గురించి సంక్షిప్త పరిచయం రాయాల్సి ఉంటుంది. ఇలా ఇప్పటి వరకూ ఆమె వేల సంఖ్యలో పోస్ట్‌కార్డులు సేకరించింది. ఎంతోమంది చిన్నారులకు వీటిని అందజేస్తున్నది. ‘తద్వారా కొంతమంది పిల్లలు స్ఫూర్తి పొందినా సంతోషమే’ అని చెబుతున్నారు ప్రియాంక. పోస్ట్‌కార్డు ప్రాజెక్టుకోసం ప్రత్యేకంగా ఓ వెబ్‌సైట్‌ను కూడా నడుపుతున్నారామె. తన వద్ద ఉన్న పోస్ట్‌కార్డులతో పెద్ద ప్రదర్శన ఏర్పాటు చేయాలనే ఆలోచనలోనూ ఉన్నారు ప్రియాంక.


logo