మంగళవారం 26 మే 2020
Zindagi - May 23, 2020 , 00:09:30

నేనూ నా బ్రూనో!

నేనూ నా బ్రూనో!

లాక్‌డౌన్‌ సమయంలో సెలబ్రిటీలు వింతవింత వ్యాపకాలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఒకరు వంట చేస్తూ.. ఒకరు ఇల్లు తుడుస్తూ.. ఇలా ఎవరిదారి వారిది. ప్రీతీ జింటా సైతం లాక్‌డౌన్‌ జ్ఞాపకాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంది. షూటింగ్‌లూ స్టోరీ సిట్టింగ్‌లూ లేకపోవడంతో, తన పెంపుడు కుక్క బ్రూనోను కౌగిలించుకొని హాయిగా నిద్రపోయిందట.  బ్రూనోను హత్తుకొని ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘మీరు ఎవర్నయితే  ప్రేమిస్తున్నారో వారిని ప్రశాంతంగా నిద్రపోనివ్వండి’ అంటూ ఓ సందేశాన్ని సైతం జోడించింది. 


logo