శనివారం 06 జూన్ 2020
Zindagi - May 21, 2020 , 23:06:48

గేమ్స్‌తో గిన్నిస్‌లోకి..

గేమ్స్‌తో గిన్నిస్‌లోకి..

పిల్లలు వీడియోగేమ్‌లు ఆడుతుంటే వద్దని వారిస్తుంటారు బామ్మలు. అంతటితో ఆగకుండా ‘మా కాలంలో అయితేనా?’ అంటూ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తుంటారు. కానీ జపాన్‌కి చెందిన హమాకో మోరీ మాత్రం, ఏకంగా 39 సంవత్సరాల పాటు వీడియో గేమ్‌లు ఆడుతూ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు కొట్టేసింది. అతి పెద్ద గేమింగ్‌ యూట్యూబర్‌గా కూడా పేరు సంపాదించింది. ‘గేమర్‌ గ్రాండ్‌' పేరుతో 2015లో లాంచ్‌ అయిన ఈ యూట్యూబ్‌కి 2.5 లక్షల సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. ఇందులో తన వీడియో గేమ్‌ల గురించి కూడా పోస్ట్‌ చేస్తుంటుంది. కొన్నిసార్లు సాయంత్రం ఎప్పుడో మొదలు పెట్టి తెల్లవారుజాము రెండు గంటల వరకూ ఆడుతూనే ఉంటుంది. ‘పిల్లలే వీడియోగేమ్‌ ఆడాలని లేదు. పెద్దలైన మాలాంటి వారికి కూడా ఇవంటే సరదా. ఆ ఉత్సాహం కొద్దీ రికార్డు సొంతం చేసుకున్నా. చాలా సంతోషంగా ఉంది’ అంటున్నది మోరీ బోసినవ్వులు చిందిస్తూ.logo