శనివారం 06 జూన్ 2020
Zindagi - May 21, 2020 , 23:06:42

ఉల్లి..బ్రేకప్‌ లొల్లి

ఉల్లి..బ్రేకప్‌ లొల్లి

బ్రేకప్‌ చెప్పుకోవాల్సి వస్తే.. ఎవరి బహుమతులు వారు తీసేసుకుంటారు. మెసేజ్‌లు డిలీట్‌ చేస్తారు. ఫొటోలు తగులబెడతారు. అయినప్పటికీ మరచిపోలేకపోతే, మళ్లీ ప్రేమాయణం నడిపిస్తారు. కానీ  బ్రేకప్‌ చెప్పిన యువకుడికి ఓ ప్రేయసి కన్నీరు తెప్పించింది. అందుకోసం భారీగా ఖర్చు పెట్టింది కూడా.


చైనాలోని ఓ ప్రేమజంట పార్కులు, థియేటర్లు, పార్టీలు, ఫంక్షన్లు... అన్ని చోట్లా తిరిగింది. ఆ తర్వాత మనస్పర్ధలతో బ్రేకప్‌ చెప్పేసుకుంది. ప్రేయసి జాహో మాత్రం ప్రియుడిని మరువలేకపోయింది. మే 20న చైనాలో వాలెంటైన్స్‌డే. తెల్లారేసరికి ప్రియుడి ఇంటి ఎదుట వెయ్యి కిలోల ఉల్లిగడ్డలు పోసేసింది. వాటితోపాటు ఓ కాగితంపై తాను చెప్పాలనుకున్నది ఇలా రాసింది... ‘మూడ్రోజులుగా ఏడుస్తూనే ఉన్నా.. ఇప్పుడిక నీ వంతు! ఈ ఉల్లిగడ్డల్ని వాలెంటైన్స్‌ డే కానుక అనుకుంటావో.. తిని ఏడుస్తావో నీ ఇష్టం’. ఇది ఆ లెటర్‌ సారాంశం.  ఉల్లి బస్తాల్ని చూసి ఏం చేయాలో తెలియక నెత్తి గోక్కుంటున్న ప్రియుడిని దూరం నుంచి ఫొటో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది జాహో.logo