శనివారం 06 జూన్ 2020
Zindagi - May 21, 2020 , 23:06:38

రోగానికి అడ్డుకట్ట.. రాగి!

రోగానికి అడ్డుకట్ట.. రాగి!

లాక్‌డౌన్‌ చివరికి వచ్చినా, మాస్క్‌లు మాత్రం తప్పనిసరి అయ్యేలా ఉంది పరిస్థితి. అయితే ఇప్పటికే కాటన్‌తో, ఇతర మెటీరియల్‌తో మాస్క్‌లను డిజైన్‌ చేస్తున్నారు. కొందరైతే ఏకంగా మ్యాచింగ్‌ మాస్క్‌లు అంటూ డ్రెస్‌ ఫ్యాబ్రిక్‌లతోనే కుట్టేస్తున్నారు. అయితే, సంప్రదాయ లోహమైన రాగి అనేక హానికారక సూక్ష్మజీవులను నిలువరిస్తుందని అందరికీ తెలుసు. రాగి మీద నాలుగు గంటలకు మించి వైరస్‌ ఉండలేదనీ పరిశోధనల్లో నిరూపితమైంది. దీంతో, రాగి మాస్క్‌లు అయితే ఆరోగ్యానికి చాలా మంచిదని చాలామంది భావిస్తున్నారు. చూడటానికి కూడా బాగానే ఉంటాయి ఈ మాస్క్‌లు. 


logo