మంగళవారం 26 మే 2020
Zindagi - May 20, 2020 , 23:01:04

‘దివ్య’మైన నిర్ణయం

‘దివ్య’మైన నిర్ణయం

దివ్యాసింగ్‌ అనే డాక్టరమ్మ భర్తతో పాటు దేశం కాని దేశం వెళ్లింది. కానీ  మాతృభూమిలో డాక్టర్ల అవసరం ఉందని తెలియగానే, భర్తకు సర్ది చెప్పి  భారతదేశానికి తిరిగి వచ్చేసింది, మూడు నెలల క్రితం.. 

జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడిసిన్‌ అండ్‌ రీసెర్చ్‌ నుంచి జనరల్‌ సర్జరీలో ఎంఎస్‌ చేసింది దివ్య. తర్వాత తన భర్తతో కలిసి ఆఫ్రికాకి వెళ్లింది. ఆయన ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ అధికారి. అక్కడి రాయబార కార్యాలయంలో ఉన్నతోద్యోగి. తాజా  బదిలీతో ముంబై నుంచి మకాం ఆఫ్రికాకి మారింది. కానీ కరోనా మహమ్మారి ఇండియాని కూడా కబళిస్తున్నదని తెలియగానే మార్చి మొదటి వారంలోనే ముంబైకి చేరుకుంది దివ్యాసింగ్‌. అప్పటికి ఇక్కడ 400 కేసులు మాత్రమే ఉన్నాయి. నెలరోజుల పాటు కరోనా లక్షణాలను గుర్తించేందుకు ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టింది. పదిమంది డాక్టర్లతో ఒక బృందంగా ఏర్పడి ఈ కార్యక్రమాలను నిర్వహించింది. అంతేకాదు.. క్రౌడ్‌ ఫండింగ్‌తో ఇతర డాక్టర్లకు పీపీఈ కిట్లను  తెప్పించింది. క్యాన్సర్‌ పేషెంట్ల కోసం ఒక ఎన్జీవో విగ్గులను తయారు చేస్తున్నదని తెలుసుకుని.. స్వచ్ఛందంగా తన జుట్టును కత్తిరించి ఇచ్చింది. ‘అందరూ నన్ను అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నావెందుకు? అని అడిగారు. ‘ఇది నా కర్తవ్యం అని చెప్పాను. దేశం కోసం నేను ఈ మాత్రం చేయలేకపోతే ఎలా?’ అంటున్నది దివ్య. logo