సోమవారం 25 మే 2020
Zindagi - May 20, 2020 , 23:00:59

బంధాల్లో ‘బ్యాడ్‌ మూడ్‌'

బంధాల్లో ‘బ్యాడ్‌ మూడ్‌'

‘శృంగారం’ రెండువైపులా పదును ఉన్న కత్తి లాంటిది. ఆ అనుభవం ద్వారా భాగస్వామితో కలిసి అనుభూతుల్ని ఆస్వాదించవచ్చు. అనుబంధాన్ని మరింత పెంచుకోవచ్చు. కొన్నిసార్లు భాగస్వామి అసంతృప్తి వల్ల  అగాథమూ ఏర్పడవచ్చు. 

 జీవిత భాగస్వామి ‘బ్యాడ్‌ మూడ్‌'లో ఉన్నప్పుడు మన ఎమోషన్స్‌ని తన మీద రుద్దకూడదు. తనలోని దుఃఖం, దిగులు, కోపం, ఆందోళన  తదితర ఉద్వేగాల ప్రభావంతో మనమూ  ‘బ్యాడ్‌ మూడ్‌'లోకి వెళ్లిపోకూడదు.  డిప్రెషన్‌ రోగితో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా ఎంతో కొంత డిప్రెషన్‌కి గురవుతామని ఓ డాక్టర్ల బృందం గుర్తించింది. భావోద్వేగాలనేవి ఒక విధంగా అంటువ్యాధుల్లాంటివి. మన పక్కన ఒకరు దుఃఖంలో ఉంటే, మనం సంతోషపడలేం. ఆ దుఃఖంలో ఎంతో కొంత పాలుపంచుకుంటాం. భావోద్వేగాలు ఏదో ఓ రూపంలో ఇవతలి వ్యక్తి మీద ప్రభావం చూపుతాయన్నది నిజం. జీవిత భాగస్వామి ‘బ్యాడ్‌మూడ్‌'లో ఉన్నప్పుడు ప్రత్యేకించి ఎలాంటి సహాయం చేయక్కర్లేదు. తన మూడ్‌ని అర్థం చేసుకుంటే చాలు. ఆ సమయంలో తనను కాసేపు ఒంటరిగా వదిలేస్తే మంచిది. లేదంటే ‘నేనున్నాను’ అనే పరోక్షమైన భరోసా కల్పించాలి. శృంగారం కూడా మూడ్‌ని డైవర్ట్‌ చేస్తుంది.  మనసుకు మందులా  పనిచేస్తుందంటారు నిపుణులు.


logo