శనివారం 06 జూన్ 2020
Zindagi - May 20, 2020 , 23:00:53

అతియా... మనసున్నదయా!

అతియా... మనసున్నదయా!

సునీల్‌ శెట్టి అన్ని భాషల్లోనూ పాపులర్‌ నటుడే. అతడి కూతురు అతియా శెట్టి. ఈ భామ కూడా బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. నాలుగు సినిమాలే అయినా తన నటనతో మంచి మార్కులు సంపాదించింది. ఇప్పుడు సేవలోనూ తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకుంటున్నది. తల్లి మానాశెట్టితో కలిసి ‘సేవ్‌ ద చిల్డ్రన్‌ ఇండియా’ అనే ఆర్గనైజేషన్‌ తరఫున పనిచేస్తున్నది. నిత్యావసర సరుకులు, మందులు పంచుతున్నది. అంతేకాదు.. మరొక సంస్థతో కలిసి వినికిడి లోపం ఉన్న వారికి బ్యాటరీలను అందిస్తున్నది. వినికిడి పరికరాలకు తరచూ బ్యాటరీలు మార్చాల్సి ఉంటుంది. దుకాణాలు మూసి ఉండటంతో గిడ్డంగులతో మాట్లాడి ఆ బ్యాటరీలను ఇప్పించింది. అలా, మంచి మనసున్న నటిగా కూడా పేరు సంపాదించుకున్నది అతియా.


logo