మంగళవారం 26 మే 2020
Zindagi - May 19, 2020 , 23:01:41

ఇట్లనే తిందాం!

ఇట్లనే తిందాం!

పండ్లు, కాయగూరలు, గింజలు, పప్పులు, కందమూలాలు, సుగంధ ద్రవ్యాలు ప్రకృతి మనకు అందించిన ఆరోగ్యవరాలు.  అయితే వీటిని తినే పద్ధతినిబట్టే పోషకాలు లభిస్తాయి. అందుకే వేటిని ఎలా తినాలో తెలుసుకోవాలి మరి...

కోడిగుడ్లు: ప్రొటీన్లు, ఫ్యాటీ ఆమ్లాలు, విటమిన్లు, మినరల్స్‌ సమృద్ధిగా ఉంటాయి. 

ఎలా తినాలి? : బాగా ఉడకబెట్టి, మెత్తగా చేసి, అందులో కొద్దిగా ఉప్పు చల్లి, ఆలివ్‌ నూనెతో కలిపి తింటే మంచిది. 


 ఉసిరికాయలు: చెడుకొవ్వును, రక్తంలోని చక్కెరను, ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గిస్తాయి. సి-విటమిన్‌ పుష్కలం. 

ఎలా తినాలి?  రోజూ ఒక టేబుల్‌స్పూన్‌ ఉసిరి రసాన్ని తేనెతో కలిపి సలాడ్‌ చేసుకుని తినవచ్చు.  చిక్కుళ్లు: ఊబకాయం, గుండెజబ్బు, క్యాన్సర్‌ లాంటి వ్యాధులను నివారిస్తాయి.  

ఎలా తినాలి? : ఉడకబెట్టిన బీన్స్‌ను స్నాక్స్‌గా తీసుకోవచ్చు.  సూప్‌లు, సలాడ్‌లలో కలిపి కూడా తినవచ్చు. 


బీట్‌రూట్‌: ఫోలేట్‌, మాంగనీస్‌, పొటాషియం తగిన మోతాదులో ఉంటాయి. శక్తిమంతమైన యాంటి ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.  

ఎలా తినాలి?:  పచ్చి బీట్‌రూట్‌ తురుమును సలాడ్‌లలో కలిపి, లేదా కొత్తిమీరతో తినవచ్చు. 


పెరుగు: జీర్ణశక్తి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  ప్రొటీన్లు, క్యాల్షియం చాలా ఎక్కువ. 

ఎలా తినాలి? : అన్నంలోనే కాకుండా పండ్లముక్కలు వేసుకుని కూడా తినవచ్చు. కొత్తిమీర చల్లుకుని తిన్నా బావుంటుంది. 


 వెల్లుల్లి:  క్రమం తప్పకుండా తీసుకుంటే చెడుకొవ్వును, అధిక రక్తపోటును తగ్గించుకోవచ్చు. 

ఎలా తినాలి? : వీటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి సలాడ్‌లలోను, సూప్‌లలోను, సాస్‌లోను కలుపుకోవచ్చు. 


logo