శనివారం 06 జూన్ 2020
Zindagi - May 19, 2020 , 23:01:40

కరోనా ఖేల్‌ ఖతం

కరోనా ఖేల్‌ ఖతం

ప్రపంచ విపత్తును ఆ దేశమూ ఎదుర్కొంది. కరోనాతో  సమర్థంగా పోరాడింది. ఆ మహమ్మారి వైరస్‌ను జయించిన తొలి యూరప్‌ దేశం తమదేనంటూ సాధికారికంగా ప్రకటించుకుంది స్లొవేకియా. 

కరోనాను అంతర్జాతీయ విపత్తుగా ప్రకటించక ముందే... ఆ మహమ్మారి బారిన పడింది స్లొవేనియా. కేసులూ వేగంగా పెరిగాయి. దీంతో ప్రభుత్వం రెండు నెలలపాటు కఠిన  చర్యలు తీసుకుంది. ఆ యుద్ధంలో విజయం సాధించింది.  దేశ ప్రధాని జానేజ్‌ జాన్సా ఇటీవలే తమ మాతృభూమిని కరోనా రహిత దేశంగా ప్రకటించాడు. దేశ సరిహద్దులు కూడా తెరుచున్నాయి. జనం సాధారణంగా తిరిగే పరిస్థితులు ఉన్నాయని అధికార వర్గాలు తెలుపుతున్నాయి. సరిహద్దు ప్రాంతాలైన ఆస్ట్రియా, హంగేరీ, ఇటలీల నుంచి వచ్చిన వారు కూడా సురక్షితంగా ఉన్నారనీ, కొత్తగా వచ్చేవారు క్వారంటైన్‌లో ఉంటారనీ ప్రధాని తెలిపారు. ఆ దేశంలో రెండు నెలలలో 104 మంది మృతి చెందారు. 1467 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం అన్నీ నెగెటివ్‌ రిపోర్టులే రావడంతో స్ల్లొవేనియా ఊపిరి పీల్చుకుంది. logo