గురువారం 09 జూలై 2020
Zindagi - May 19, 2020 , 23:01:38

స్పైడర్‌మాన్‌లా శానిటైజర్‌!

స్పైడర్‌మాన్‌లా శానిటైజర్‌!

ఈ సంక్షోభం తర్వాత కూడా హ్యాండ్‌ శానిటైజర్ల వాడకం ఇలానే కొనసాగేలా ఉంది. అందుకే సరికొత్త శానిటైజర్‌ బ్యాండ్లను తయారు చేసే పనిలో పడింది ప్యూమ్‌పిక్స్‌ అనే కంపెనీ. వీటిని అచ్చు.. స్పైడర్‌మ్యాన్‌ బ్యాండ్‌లా డిజైన్‌ చేశారు. ఒకసారి నొక్కగానే బుల్లెట్‌లా శానిటైజర్‌ వచ్చి చేతిలో పడిపోతుంది. చేతులను శుభ్రంగా తుడిచేసుకోవచ్చు. ఈ బ్యాండ్‌ చాలా తేలికగా కూడా ఉంటుందట. చేతికి ఎలాంటి ఇబ్బందీ కలిగించకుండా ైస్టెల్‌గా  పెట్టుకొని తిరగొచ్చు. సుమారు వంద సార్లు పంపింగ్‌ చేసుకోవచ్చని అంటున్నది ప్యూమ్‌పిక్స్‌. రీఫిల్‌ సౌకర్యమూ  ఉంది. ధర రూ. 2, 200గా నిర్ణయించింది కంపెనీ యాజమాన్యం.


logo