మంగళవారం 26 మే 2020
Zindagi - May 18, 2020 , 22:30:22

బాలల గేయం

బాలల గేయం

పిడుగులం మేం బుడుగులం

చల్లని వెన్నెల గొడుగులం

వాగుల వంకల పరుగులం

ఆప్యాయతకు బానిసలం


ఆనందం మా ప్రపంచం

దాన్నేమన్నా మేం సహించం


బంకమట్టితో మేం ఇళ్లను చేస్తం

ఇసుకతోటి మేం కోటలు కడతాం

లక్కపిడకలతొ వంటా వార్పు

పైలంగా మేం నేర్చుకుంటాం

బొమ్మరిల్లు ఆటలాడి 

వావీవరసలు పోల్చుకుంటాం

మంచో చెడ్డో తెలీదుగానీ 

పెద్దలను మేం అనుకరిస్తాం

ఆనందం మా ప్రపంచం

దాన్నేమన్నా మేం సహించం

పిడుగులం మేం 

బుడుగులం -


రావి ఆకులతో బూరలు చేస్తాం

కొబ్బరాకులతో రాకెట్లేస్తాం

గుర్రం ఎక్కి రాజుగా వచ్చి

రాకుమారిని రక్షించేస్తాం.

ముద్దులుపెడితే దగ్గరికొస్తాం

దెబ్బలు కొడితే దూరం పోతాం

ఆనందం మా ప్రపంచం

దాన్నేమన్నా మేం సహించం


పిడుగులం మేం బుడుగులం

చల్లని వెన్నెల గొడుగులం

వాగుల వంకల పరుగులం

ఆప్యాయతలకు బానిసలం.

రచన: దేవేంద్ర, ఖమ్మంlogo