శనివారం 06 జూన్ 2020
Zindagi - May 18, 2020 , 22:29:28

సేంద్రియ సాగుతో జీవితాలను మార్చింది

సేంద్రియ సాగుతో జీవితాలను మార్చింది

ముంబైకి చెందిన రుచి జైన్‌.. చిన్నప్పటి నుంచి ఆర్గానిక్‌ ఆహారమే తినేది. వాళ్ల అమ్మ ఇంట్లోనే కూరగాయలను పండించి మరీ వండి వడ్డించేది. సేంద్రియ బియ్యమూ గోధుమలే కొనేవారు. అలా తనకు రసాయనాల ఆనవాలు లేని భోజనం అలవాటు అయింది. ఆ మక్కువతోనే ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ఎన్విరాన్‌మెంట్‌ చేంజ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్‌ డిగ్రీ పొందింది.

 ...ఆ తర్వాత వరల్డ్‌ బ్యాంక్‌ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నప్పుడు  దేశంలోని మారుమూల పల్లెలలోని  రైతుల కష్టనష్టాలను కళ్లారా చూసింది. జీవితాలను మార్చాలనే ఉద్దేశంతో వారికి ఆర్గానిక్‌ ఫామింగ్‌ మీద అవగాహన కల్పించింది. అంతేకాదు.. ఆ గ్రామీణులు పండించిన పంటను అమ్మేందుకు తానే పూనుకున్నది. ఇందుకు ‘తారు’ పేరుతో ఒక స్టార్టప్‌ను మొదలుపెట్టింది. దీనిద్వారా మొదట్లో ఆర్గానిక్‌ పసుపు, బెల్లం మాత్రమే విక్రయించేది. ఆ పై బియ్యం, ఇతర పప్పు ధాన్యాలతో సహా 300 రకాల ఉత్పత్తులను.. మహారాష్ట్ర, కర్ణాటక, అసోం, కేరళ, ఉత్తరాఖండ్‌ రైతుల నుంచి తెప్పించి స్వయంగా మార్కెట్‌ చేయడం మొదలు పెట్టింది. దీనిద్వారా ఇప్పుడు పదివేల మంది రైతులు స్థిరమైన ఆదాయాన్ని పొందుతున్నారు. ‘వాళ్ల జీవితంలో మార్పు తీసుకురావడానికి ఆర్గానిక్‌ పంటను మించిన మార్గం లేదనిపించింది’ అంటారామె. 


logo