సోమవారం 25 మే 2020
Zindagi - May 18, 2020 , 22:29:32

సేవలకు సెల్యూట్‌!

సేవలకు సెల్యూట్‌!

బాలీవుడ్‌ ప్రముఖులు కరోనాపై అవగాహన కలిగించడానికి సోషల్‌ మీడియాలో అనేక పోస్టులు, వీడియోలు పెడుతున్నారు. మలైకా ఇందుకు కాస్త భిన్నంగా... అసలు ఇంట్లోనే ఎందుకు ఉండాలి? అంటూ సామాజిక బాధ్యత గురించి ఓ పెద్ద పోస్ట్‌ షేర్‌ చేసింది. ఆ మధ్య మహారాష్ట్ర పోలీస్‌ల అంకితభావాన్ని కొనియాడుతూ... ప్రజలను ఎలా సురక్షితంగా ఉంచుతున్నారో కళ్లకు కట్టినట్టు తెలిపింది. మరొక పోస్ట్‌లో  తన కజిన్‌ ఒకరు హెల్త్‌ వర్కర్‌గా పనిచేస్తున్నారని ప్రస్తావిస్తూ... డాక్టర్లు, నర్సుల సేవకు సెల్యూట్‌ చేస్తున్నానని కొనియాడింది. పనిలో పనిగా తన కజిన్‌ను పొగడ్తలలో ముంచేసింది.logo