మంగళవారం 26 మే 2020
Zindagi - May 17, 2020 , 22:48:36

కొవిడ్‌తో కొట్లాటకు.. 5 ఆయుధాలు!

కొవిడ్‌తో కొట్లాటకు.. 5 ఆయుధాలు!

‘ఇంటి గోడ గట్టిగా ఉంటే, శత్రువులు ఎట్టి పరిస్థితిలోనూ లోపలికి రాలేరు. ప్రవేశించినా మన చేతిలో బలమైన అస్త్రశస్ర్తాలు ఉంటే.. ఎంత పెద్ద ప్రత్యర్థినైనా నిలువరించవచ్చు. కరోనా వ్యాధిని ఎదుర్కొనడానికి  మన దగ్గరున్న ఆయుధం.. వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసుకోవడం. ఆహారం, అలవాట్లు, ఆలోచన, విశ్రాంతి, వ్యాయామం అనే పంచసూత్రాలతో ఇమ్యూనిటీని పెంచుకోవచ్చు’ అని  అంటున్నారు యశోద హాస్పిటల్స్‌ సీనియర్‌ జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ఎం.వి. రావు..

1. ఆహారం


శరీరంలోని ఏ వ్యవస్థకైనా శక్తిని అందించేది ఆహారమే. అందుకే ఎంత మంచి ఆహారం తీసుకుంటే అంత బాగా పనిచేస్తాయి అవయవాలు. వ్యాధినిరోధక వ్యవస్థ కూడా అంతే. ప్రొటీన్లతో కూడిన ఆహారం ఎక్కువగా తీసుకుంటే వ్యాధినిరోధక కణాలు బాగా పనిచేస్తాయి. రక్తవృద్ధికి పనికొచ్చే ఆహారం కూడా ఎక్కువగా తీసుకోవాలి. శాకాహారులైతే పప్పులు ఎక్కువగా తీసుకోవాలి. మనదేశంలో 60 శాతం మందిలో అనీమియా ఉంది. బి-12 లోపం కూడా ఎక్కువే. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గవచ్చు. అందుకే ఇనుము, జింక్‌, బి విటమిన్లు ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. విటమిన్‌ సి ఎక్కువగా ఉండే సిట్రస్‌ పండ్లు, మొలకెత్తిన విత్తనాలు, గింజలు ఇమ్యూనిటీని పెంచేవే. 

2. అలవాట్లు


ఆల్కహాల్‌ వల్ల కాలేయమే కాదు.. అన్ని అవయవాలూ దెబ్బతింటాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. ఇన్‌ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆల్కహాల్‌ ప్రభావం గుండె, మెదడు, ఒక్కోసారి రక్తనాళాలపై కూడా ఉంటుం ది. ఆల్కహాల్‌ విషంలా శరీరమంతటినీ కబళిస్తుంది. ఆల్కహాల్‌ పీడితుల్లో అనీమియా ఉంటుం ది. దీనివల్ల పోషకాహార లేమి ఏర్పడి, ఇన్‌ఫెక్షన్లు పెరుగుతాయి. చివరికి చిన్న సమస్యే పెద్దదవుతుంది. ధూమపానం కూడా ప్రమాదకరమే.

3. ఆలోచన


మనం ఒత్తిడికి గురికావడానికి కారణం పరిస్థితులు కాదు, మన ఆలోచనా విధానమే. ఉద్యోగం ఏమవుతుందో అన్న టెన్షన్‌.. ఆర్థిక పరిస్థితి కుంటుపడుతుందేమోనన్న భయం.. పెద్దల ఆరోగ్యం పట్ల ఆందోళన.. మన ఆలోచనలో సానుకూలత ఉంటే ఏ పరిస్థితులూ మనల్ని ఏమీ చేయలేవు. తీవ్రమైన ఒత్తిడి, నెగెటివ్‌ ఆలోచనల వల్ల స్ట్రెస్‌ హార్మోన్లు విడుదలవుతాయి. వీటి ప్రభావం వ్యాధినిరోధక వ్యవస్థ పైన ఉంటుంది. కాని సానుకూల ఆలోచనలు మాత్రం మెదడులోని రసాయనాలను సమతుల్యం చేసి, ఇమ్యూనిటీని పెంచుతాయి. 

4. విశ్రాంతి