శనివారం 06 జూన్ 2020
Zindagi - May 17, 2020 , 22:48:36

‘శానిటరీ’ సేవ

‘శానిటరీ’ సేవ

లాక్‌డౌన్‌ వల్ల మహిళలకు అత్యవసరం అయ్యే శానిటరీ నాప్‌కిన్ల కొరత కూడా ఏర్పడింది. అందుకే ఒలింపిక్‌ క్రీడాకారిణి ద్యుతీచంద్‌ ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టింది. ఒడిశాలోని భువనేశ్వర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనేక గ్రామాలకు తను సాయం అందించడానికి వెళ్లింది. నిత్యావసరాలతోపాటు శానిటరీ నాప్‌కిన్లను కూడా అందించింది. ‘నాప్‌కిన్లు ఇప్పుడు చాలా అవసరం. మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే ఇవీ అందుబాటులో ఉండాలి. ధర తక్కువే అయినా, వీటి కొరత గురించి గ్రామీణ మహిళలు మాట్లాడే పరిస్థితులు లేవు. అందుకే అధికారుల అనుమతితో వారికి నాప్‌కిన్లు అందిస్తున్నాను’ అని ఆమె తెలిపింది. logo