శనివారం 06 జూన్ 2020
Zindagi - May 17, 2020 , 22:48:35

ఔషధ గుణాల తెల్ల నేరేడు

ఔషధ గుణాల తెల్ల నేరేడు

మనం నల్ల నేరేడును చూసి ఉంటాం.. తిని ఉంటాం.. కానీ తైవాన్‌ దేశానికి చెందిన తెల్ల నేరేడు(వైట్‌ కాలాజామూన్‌) రకంలో ఎన్నో ప్రత్యేకతలు మీకు తెలుసా... అవును, తెల్ల నేరేడులో ఔషధ గుణాలు ఉన్నట్టు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని గంగా నర్సరీ నిర్వాహకుడు ఐసీ మోహన్‌ తెలిపారు. శుక్రవారం తన నర్సరీలో తెల్ల నేరేడు మొక్కను ప్రదర్శనకు ఉంచారు. తెల్ల నేరేడులో మధుమేహం, అధిక రక్తపోటులను నియంత్రణలో ఉంచుతుందని వివరించారు. ఈ మొక్క హైబ్రీడ్‌ రకమని, సంవత్సరంలోపు పంట కోతకు వస్తుందన్నారు.  తెల్ల నేరేడు మొక్కలు తన నర్సరీలో అందుబాటులో ఉన్నట్టు మోహన్‌ చెబుతున్నారు.  logo