శనివారం 06 జూన్ 2020
Zindagi - May 17, 2020 , 22:48:33

బలం..బలహీనత

బలం..బలహీనత

దశరథం తన తోటలో పనులు చేస్తున్నాడు. ఇంతలో అక్కడికి పన్నెండేళ్ళ కొడుకు రాము వచ్చాడు. తను కూడా తోచిన పనులు చేస్తూ తండ్రికి సాయం చేశాడు. ఇంతలో దశరథం, రామువైపు చూసి ‘రామూ! నీ పక్కనున్న ఆ రాయిని తొలగించు. మనం అక్కడ ఒక మంచి చెట్టును నాటుదాం’ అన్నాడు. రాము వెంటనే ఆ రాయిని తొలగించేందుకు ప్రయత్నించాడు. కానీ అది అంగుళం కూడా కదల్లేదు. ‘నాన్నా! ఈ రాయి చాలా బలంగా పాతుకుపోయి ఉంది. దీనిని తొలగించడం నావల్ల కావట్లేదు’   అని నిరాశగా చెప్పాడు రాము. 
అబ్బాయి తెలివితేటలను పరీక్షిస్తున్న దశరథం ‘బాబూ! మళ్ళీ ప్రయత్నించు. నీ బలాన్నంతటినీ ఉపయోగించి ఎలాగైనా ఆ రాయిని పెకిలించి, తొలగించు’ అని ప్రోత్సాహంగా చెప్పాడు. ఎంత బలంగా ప్రయత్నించినా ఆ రాయి కదలకపోవడంతో, రాము ఇక భరించలేక బిగ్గరగా ఏడవటం మొదలుపెట్టాడు. రాముని సముదాయించేందుకు దగ్గరకు వెళ్ళాడు దశరథం. ‘నేను నీ బలాన్నంతటినీ ఉపయోగించమని చెప్పానా లేదా? ప్రశ్నించాడు దశరథం. ‘అవును, నాన్నా. కానీ నేను నా శక్తి మేరకు ప్రయత్నించా. కానీ రాయి కనీసం కదలను కూడా లేదు!’ అని ఏడుస్తూ చెప్పాడు రాము. దీనికి తండ్రి స్పందిస్తూ ‘నీవు నన్ను మర్చిపోయావా రామూ! నా సహాయం కోరవచ్చు కదా! నీకున్న బలంలో నన్ను కూడా ఒక బలంగా ఎందుకు అనుకోవు?’ అని తండ్రి అనడంతో రాము ఆలోచనలో పడ్డాడు.  ఏడుపు  ఆగిపోయింది. తండ్రి సహాయంతో ఆ రాయిని సులభంగా పెకిలించాడు. ఇద్దరూ కలిసి ఒక మామిడి మొక్కను నాటారు. నిజమే, నాన్న ఎప్పుడూ బిడ్డకు బలమే


logo