మంగళవారం 26 మే 2020
Zindagi - May 16, 2020 , 22:45:47

మాటల మాంత్రికురాలు

మాటల మాంత్రికురాలు

జెసిందా అడెర్న్‌.. న్యూజిలాండ్‌ యువ ప్రధాని. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ అనేక సంక్షోభాలను ఎదుర్కొన్నది. కొవిడ్‌ ప్రభావాన్నీ చవి చూసింది. ఆమె మాటలు ప్రజలకు కొండంత ధైర్యాన్ని ఇస్తాయి. కొన్నిసార్లు  మనోబలాన్ని ఇచ్చే మంత్రాల్లానూ పనిచేస్తాయి.  సోషల్‌ మీడియాలో జెసిందా కొటేషన్స్‌ హాట్‌కేకులే. 

‘మల్టీటాస్కింగ్‌ నాకే కాదు, ప్రతి మహిళకూ అలవాటే. ఆ తల్లుల శ్రమ ముందు నా కష్టం ఏపాటిది?’

‘ఆడవాళ్లు సాధించే చిన్నపాటి విజయాలు నాకు ఎలాంటి సంతృప్తినీ ఇవ్వవు. అంతర్జాతీయంగా స్త్రీలు, బాలికలు అత్యంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ముందు ఆ జీవితాలు మారాలి.’

‘నాలుగు గోడల మధ్య కూర్చుని నాకు ఆత్మవిశ్వాసం ఉందని పొంగిపోవడం కాదు. ఆ గోడల్ని బద్దలు కొట్టుకుని బయటికి రావాలి. పోటీ ప్రపంచంలో నిలబడాలి. కలబడాలి. గెలవాలి.’

‘మిమ్మల్ని మీరే నమ్మకపోతే.. ప్రపంచం ఎలా నమ్ముతుంది?’


logo