మంగళవారం 26 మే 2020
Zindagi - May 16, 2020 , 22:45:53

‘రైస్‌' ఏటీఎం

‘రైస్‌' ఏటీఎం

ప్రపంచం ఒక సవాలును ఎదుర్కొంటున్నది. ఎంతోమందికి గుప్పెడు గింజలు కూడా అందడం  లేదు. కరోనా కారణంగా  ఆగ్నేయ  ఆసియాలో లక్షల మంది ఉపాధిని కోల్పోయారు. వారి జీవనస్థితిని మెరుగుపరచడానికి ప్రభుత్వాలు తమవంతు కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇండొనేషియా సర్కారు వినూత్న ప్రయోగం చేసింది. ‘రైస్‌ ఏటీఎం’లను అందుబాటులోకి తెచ్చింది. రాజధాని జకార్తా కేంద్రంగా 20 బియ్యం ఏటీఎంలను ఏర్పాటు చేసింది. అచ్చంగా బ్యాంక్‌ యంత్రంలానే ఇదీ పని చేస్తుంది. మ్యాగ్నటిక్‌ కార్డును ఉంచితే చాలు, గింజలు రాలిపడతాయి. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఇదో  ప్రయోగం.


logo