మంగళవారం 26 మే 2020
Zindagi - May 11, 2020 , 22:58:50

అనారోగ్యానికి... నిద్రలేమి తోడైతే!

అనారోగ్యానికి... నిద్రలేమి తోడైతే!

నిద్రలేమితో బాధపడేవాళ్లు చాలా సులభంగా ఇన్‌ఫెక్షన్లకు గురి అవుతారని స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది. సాధారణంగా ఏదైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు శరీరంలోని జీవక్రియలన్నీ మందగిస్తాయి. అదేవిధంగా వ్యాధి నిరోధక సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. కాబట్టి జబ్బుతో ఉన్నవాళ్లలో ఇన్‌ఫెక్షన్లు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జబ్బుతో ఉన్నప్పుడు నిద్ర కూడా కరువైతే రకరకాల ఇన్‌ఫెక్షన్లు వేధించే అవకాశం పెరుగుతుందని ఈగల పైన జరిపిన అధ్యయనంలో వెల్లడైంది. ఒకసారి అనారోగ్యం పాలైతే, తద్వారా నిద్రలేమి సమస్య ఎక్కువైపోయి మరిన్ని సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంటుందన్నమాట. అందుకే వేళకు ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, తగినంత విశ్రాంతి తీసుకోవడం కూడా అంతే ముఖ్యమంటున్నారు అధ్యయనకారులు. ముఖ్యంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు విశ్రాంతి మరింత అవసరమన్నది మరిచిపోవద్దు. 


logo