మంగళవారం 26 మే 2020
Zindagi - May 09, 2020 , 22:46:59

ఓటీటీలో..అమ్మ సినిమాలు

ఓటీటీలో..అమ్మ  సినిమాలు

అమ్మ పాట వింటే ఒళ్లు పులకిస్తుంది. అమ్మ పాత్రను చూస్తుంటే కళ్లలో నీళ్లు తిరిగిపోతాయి. అమ్మ ఇతివృత్తంగా వచ్చిన సినిమాలను చూడటం ఓ అనుభూతి.

ఓ బేబీ

సావిత్రమ్మ అనే ఓ తల్లి తన కలల్ని నిజం చేసుకోవడానికి పాతికేళ్ల యువతిగా మారే కథ ఇది. అమ్మలోని అనురాగాన్నీ, బిడ్డ మీద ఆప్యాయతనీ కాస్త హాస్యాన్ని జోడించి చెప్పారు.

అమృత

దత్తత వెళ్లిన ఓ చిన్నారి తన తల్లి కోసం సాగించే అన్వేషణే ఈ సినిమా. నేపథ్యంతో శ్రీలంక తమిళుల జీవితాల్నీ చూపించారు.

అమ్మ చెప్పింది

తల్లి మాటే వేదంగా భావించే ఓ పిల్లాడి కథ ఇది. ఎదిగీ ఎదగని మనసు ఆ బాలుడిది.  ఓ విపత్తు నుంచి అందర్నీ కాపాడతాడు. అమ్మ గర్వపడేలా పేరు తెచ్చుకుంటాడు.


వెల్‌కమ్‌ ఒబామా

ఓ బిడ్డకు ప్రాణం పోయడానికి తన గర్భాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతుంది యశోద. ఆ తర్వాత జరిగే పరిణామాలు అమ్మతనానికి అద్దం పడతాయి. 


 కేజీఎఫ్‌

రాకీ అనే ఓ పసివాడు తన తల్లికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి చీకటి ప్రపంచంలోకి అడుగుపెడతాడు. గోల్డ్‌ మాఫియాతో తలపడతాడు.


సీక్రెట్‌ సూపర్‌స్టార్‌

గాయని కావాలన్నది ఆ బాలిక కోరిక. తండ్రి ఏమో వ్యసన పరుడు. తల్లిని నిత్యం వేధిస్తుంటాడు. దీంతో అమ్మను వెంట బెట్టుకుని తన కలను నిజం చేసుకోవడానికి బయల్దేరుతుంది.


 

లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌

శ్రీను అనే విద్యార్థికి తల్లి అంటే ప్రేమ. చెల్లెళ్లతో కలిసి చదువుల కోసం హైదరాబాద్‌లోని మావయ్య ఇంటికి చేరతాడు. ఆ మలుపుల  కథే ఇది.


ఇవేకాదు.. మొన్నటి ఛత్రపతి నుంచి నిన్నటి బాహుబలి వరకూ ఏదో ఓ రూపంలో అమ్మ ఇతివృత్తంతో వచ్చిన చిత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లోనో, అమెజాన్‌ ప్రైమ్‌లోనో చాలా ఉన్నాయి.  అమ్మతో కలిసి ఏదో ఓ అమ్మ సినిమా చూడండి ఈరోజు.


logo