గురువారం 09 జూలై 2020
Zindagi - May 09, 2020 , 22:41:39

ఇడ్లీల పెద్దమ్మ

ఇడ్లీల పెద్దమ్మ

చిల్లర వ్యాపారులు ధరలు పెంచాలనే చూస్తారు. లాక్‌డౌన్‌ సమయంలో అయితే మరీ ఎక్కువ. నిజానికి వాళ్ల కష్టాలు వాళ్లవి. టోకు వ్యాపారుల నుంచి ఒత్తిళ్లు ఉంటాయి. నిత్యావసరాల ధరలూ పెరుగుతాయి. దీంతో చిన్నాచితకా దుకాణదారులు పాత రేట్లకు అమ్మలేని పరిస్థితి. తమిళనాడులోని కోయంబత్తూరుకి చెందిన 85 యేండ్ల కమలతల్‌ మాత్రం ఒక రూపాయికే ఇడ్లీలు అమ్ముతున్నది. చాలా ఏండ్లుగా ఇదే ధర. ప్రస్తుతం కూడా ధరలు పెంచే ఆలోచన లేదని చెబుతున్నది. ‘ఈ సమయంలో పేదలకు ఇడ్లీలే ఆహారం అవుతున్నాయి. నేను ధర పెంచితే వాళ్లు ఉపవాసం ఉండాల్సి వస్తుంది. నా దగ్గర ఇడ్లీలు కొనేవాళ్లంతా నా బిడ్డలే. వాళ్లకు కష్టం కలిగితే నా తల్లి మనసు బాధపడుతుంది’ అంటుందా ఇడ్లీల పెద్దమ్మ.  logo